షాబాద్ హత్యల కేసు.. రాజ్‌కుమార్ కిరాతకంపై విస్తుపోయే నిజాలు!

Shabad murder case sensation shocking facts about Rajkumar brutality
  • షాబాద్ ఆరు హత్యల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
  • విడాకులు కోరిన భార్య, పిల్లలను హత్య చేసిన రాజ్ కుమార్
  • జూదం, బెట్టింగులకు బానిసై రూ.2 కోట్ల అప్పులు
  • విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే దారుణానికి పాల్పడ్డ నిందితుడు
షాబాద్‌లో ఆరుగురి హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచ్చలవిడి జీవితానికి, జల్సాలకు అడ్డు వస్తుందనే కారణంతోనే నిందితుడు రాజ్ కుమార్ తన భార్య సరిత, ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని వేధింపులు భరించలేక విడాకులు కావాలని అడగటమే ఈ దారుణానికి ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యల కోసం నిందితుడు ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు, కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ ఇంటర్ చదివే రోజుల్లో తనకంటే ఆరేళ్లు పెద్దదైన సరిత వద్దకు ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఆ పరిచయంతో ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలియడంతో సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. అయితే, రాజ్ కుమార్ ఆ సంబంధాలను చెడగొడుతూ వచ్చాడు. చివరికి 2018లో సరితను పెళ్లి చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే రాజ్ కుమార్ కాలక్రమేణా బెట్టింగులు, జూదం, మద్యం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఏకంగా రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు.

అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులను బెదిరించి, కొంత పొలం అమ్మించి అప్పులు తీర్చాడు. ఆ తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మిగిలిన పొలాన్ని కూడా తల్లిదండ్రులను నమ్మించి అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య సరితను తీవ్రంగా వేధించేవాడు. అతని టార్చర్ భరించలేని ఆమె, విడాకులు ఇవ్వమని కోరింది. దీంతో తన విచ్చలవిడి జీవితానికి భార్య అడ్డుగా ఉందని భావించిన రాజ్ కుమార్, ఆమెపై తీవ్రమైన పగ పెంచుకున్నాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం శుక్రవారం రాత్రి భార్య సరిత, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Rajkumar
Shabad murder case
Hyderabad crime news
Sarita murder
Telangana police
Gambling debt murder

More Telugu News