మళ్లీ పెళ్లి వార్తల్లో అనిరుధ్-కావ్య.. నవంబర్‌లో ముహూర్తం?

Anirudh Ravichander and Kavya Maran wedding rumors resurface with November date
  • ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్న అనిరుధ్, కావ్య మారన్
  • 'జైలర్ 2' విడుదలయ్యాక వివాహం అంటూ తమిళ మీడియాలో కథనాలు
  • నవంబర్‌లో పెళ్లి జరగొచ్చని ఊహాగానాలు
  • ఇరు కుటుంబాల నుంచి రాని అధికారిక ప్రకటన
ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వదంతులకు బలం చేకూరుస్తూ, ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందనే ప్రచారం ఊపందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమా విడుదల తర్వాత వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తాజాగా అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వైజీ మహేంద్ర ఈ విషయంపై స్పందించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. 'కేపీటీవీ'కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "నాకు తెలిసిన సమాచారం ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. కావ్య మారన్ సాధారణమైన అమ్మాయి కాదు. అంత పెద్ద ఐపీఎల్ జట్టును నడిపించగల సత్తా ఆమెకు ఉంది. వారిద్దరూ చాలా మంచి జోడీ" అని వ్యాఖ్యానించారు. అయితే, పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'వళై పేచ్చు'ను ఉటంకిస్తూ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రచురించిన కథనం ప్రకారం.. వీరి వివాహం 'జైలర్ 2' విడుదల తర్వాత ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు 'సియాసత్ డైలీ' కథనం ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో పెళ్లి జరగొచ్చని పేర్కొంది. అయితే, ఈ తేదీలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

రజనీకాంత్, విజయ్, షారుఖ్ ఖాన్ వంటి అగ్ర హీరోల చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ అనిరుధ్ కెరీర్‌లో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన 'జైలర్ 2'తో పాటు షారుఖ్ ఖాన్ 'కింగ్' చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇక సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా స్పందించలేదు.
Advertisement
Anirudh Ravichander
Kavya Maran
Anirudh Kavya Maran Wedding
Sunrisers Hyderabad CEO
YG Mahendran
Jailer 2

More Telugu News