అఖిల్ 'లెనిన్' క‌లెక్ష‌న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ‌ట్టిందంటే..!

Akhil Lenin collection tsunami how much it earned in three days
  • అఖిల్ 'లెనిన్' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన
  • తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్ల గ్రాస్
  • అధికారికంగా వసూళ్ల వివరాలు ప్రకటించిన చిత్రబృందం
  • మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమా
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. "మొదటి వారాంతం అద్భుతంగా ముగిసింది. ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. బాక్సాఫీస్ వేడుక చేసుకుంది. 'లెనిన్' కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది" అంటూ తమ పోస్ట్‌లో పేర్కొంది.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాలోని యాక్షన్ ఘట్టాలతో పాటు ఎస్‌ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Advertisement
Akhil Akkineni
Lenin movie collections
Lenin box office report
Sithara Entertainments
Bhagyashri Borse
Lenin three days gross

More Telugu News