నిర్దిష్ట సమయాల్లో 8 గ్లాస్‌ల నీళ్లు తాగితే శరీరం డిటాక్స్ అవుతుందా? డాక్టర్లు చెబుతోందిదే..!
- సోషల్ మీడియాలో వాటర్ చార్ట్ వైరల్
- అందులో ఉన్నవన్నీ అతిశయోక్తులేనన్న డాక్టర్లు
- నిర్దిష్ట సమయాలలో కంటే రోజంతా తగినంత ద్రవాలు తీసుకోవడమే కీలకమని వెల్లడి
- కొవ్వు కరగడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి వాటికి ఆధారాలు లేవని స్పష్టీకరణ
- ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మారే నీటి అవసరం
రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని నిర్దిష్ట సమయాల్లో తాగితే శరీరం డిటాక్స్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ చార్ట్ వైరల్ అవుతోంది. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొవ్వు కరుగుతుందని, క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు దూరమవుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వాదనల్లో చాలా వరకు అతిశయోక్తులు మాత్రమేనని, వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్లు తాగే సమయం కంటే రోజంతా తగినంత ద్రవాలు తీసుకోవడమే ఆరోగ్యానికి కీలకమని చెప్పారు.
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల రాత్రంతా కోల్పోయిన ద్రవాలు భర్తీ అవుతాయని వైద్యులు చెప్పారు. భోజనానికి 20-30 నిమిషాల ముందు నీళ్లు తాగితే కొందరిలో ఆకలి తగ్గి బరువు నియంత్రణకు సహాయపడవచ్చని పేర్కొన్నారు. అయితే నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు ప్రత్యేకంగా బయటకు వెళ్లిపోతాయనడం, కొవ్వు నేరుగా కరుగుతుందనడం లేదా రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగితే గుండెపోటు లేదా స్ట్రోక్ రాదనడం, భోజనానికి ముందు నీళ్లు తాగితే పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం 45 శాతం తగ్గుతుందనడం వంటి వాదనలకూ శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు తెలిపారు. పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మధ్యలో లేచి మూత్రవిసర్జన చేయాల్సి వచ్చి నిద్రకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రతిఒక్కరూ రోజుకు కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలనే నిబంధన కూడా సరైనది కాదని వైద్యులు తెలిపారు. వయసు, శారీరక నిర్మాణం, వాతావరణం, వ్యాయామం, ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్థితిని బట్టి నీటి అవసరం మారుతుందని వివరించారు. టీ, కాఫీ, పాలు, సూప్‌లు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల ద్వారా కూడా శరీరానికి ద్రవాలు అందుతాయని పేర్కొన్నారు. దాహంగా అనిపించినప్పుడు నీళ్లు తాగడం, రోజంతా క్రమం తప్పకుండా హైడ్రేటెడ్‌గా ఉండటమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచించారు.