రష్మిక ఆసక్తికర పోస్ట్.. 'రణబాలి'పై అంచనాలు పెంచేసింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక ఆసక్తికర పోస్ట్.. 'రణబాలి'పై అంచనాలు పెంచేసింది!

Rashmika Mandanna interesting post increases expectations on Ranabali
  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రణబాలి
  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం
  • కొన్ని సీన్లు అద్భుతంగా ఉన్నాయంటూ రష్మిక పోస్ట్
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'రణబబాలి'. తాజాగా ఈ చిత్రం గురించి రష్మిక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన ఆమె, తన ఉత్సాహాన్ని ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మ పాత్రలో రష్మిక అలరించనున్నారు.

ఎక్స్ వేదికగా రష్మిక స్పందిస్తూ.. "ఈ విషయం నేను మీతో పంచుకోవచ్చో లేదో తెలియదు. గతంలో చాలాసార్లు జరిగినట్లు దీన్ని డిలీట్ చేయమని అడగరని ఆశిస్తున్నా. కానీ, ఈ కుర్రాళ్లు చాలా బీభత్సం చేస్తున్నారు. ఆ సీన్లు అద్భుతం. నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. దీన్ని పెద్ద తెరపై చూడటానికి అస్సలు ఆగలేకపోతున్నా" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌ను కూడా ఆమె ట్యాగ్ చేశారు.

పీరియాడిక్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న రణబాలి చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. రియల్ లైఫ్ జోడీ విజయ్, రష్మిక ఈ సినిమాలోనూ జంటగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.
Advertisement
Rashmika Mandanna
Vijay Deverakonda
Ranabali
Rahul Sankrityan
Telugu Cinema
Ranabali Movie Update

More Telugu News