డబ్బు గుంజేందుకే నా పరువు తీశారు: పంజాబ్ కింగ్స్ ప్లేయర్
- తప్పుడు ఎఫ్ఐఆర్‌తో తనను బ్లాక్‌మెయిల్ చేశారన్న శశాంక్ సింగ్
- డబ్బు గుంజడానికే పరువు తీసే కుట్ర జరిగిందని ఆరోపణ
- పనిలో పెట్టుకున్న వ్యక్తికి 9 కేసుల నేర చరిత్ర ఉందని వెల్లడి
- మా వాదన వినకుండానే కేసు నమోదు చేశారంటూ ఆవేదన
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ తనపై, తన కుటుంబంపై ఇటీవల నమోదైన కేసుపై తాజాగా స్పందించాడు. సెలబ్రిటీగా తనకున్న పేరును దెబ్బతీసి, డబ్బు గుంజేందుకే ఓ వ్యక్తి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సంచలన ఆరోపణలు చేశాడు. తనపై దాడి జరిగిందంటూ ఓ వంట మనిషి పెట్టిన కేసు పూర్తిగా కట్టుకథ అని, ఇది పరువు తీసి డబ్బు రాబట్టేందుకు పన్నిన కుట్ర అని సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరించాడు.
గత నెలలో భోపాల్‌లోని తమ నివాసంలో పనిచేసే వంట మనిషిపై దాడి చేసి, ఫోన్ లాక్కున్నారని శశాంక్ సింగ్, ఆయన తండ్రి, రిటైర్డ్ స్పెషల్ డీజీపీ శైలేష్ సింగ్‌పై రతిబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను శశాంక్ పూర్తిగా ఖండించాడు.
"నిజానిజాలు తెలుసుకోకుండా వేలమంది నన్ను దూషించారు. ఒక నిరుపేదను కొట్టిన వ్యక్తిగా నన్ను చిత్రీకరించారు. ఈ ఘటన నన్ను మార్చేసింది, జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలు నేర్పింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
తమ వద్ద పనికి చేరిన వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండేదని, ఇంట్లో తిరుగుతూ ఫొటోలు తీసి ఇతరులకు పంపేవాడని శశాంక్ తెలిపాడు. దీంతో మూడో రోజే అతడిని పనిలో నుంచి పంపించేశామని, అప్పుడు అతను ఆరోగ్యంగానే వెళ్లాడని స్పష్టం చేశాడు. "ఆ తర్వాత అతడు తీవ్రంగా గాయపడినట్లు వీడియోలో చూసి మేం షాక్ అయ్యాం. పోలీసు రికార్డుల ప్రకారం అతనిపై అప్పటికే హత్యాయత్నం, గృహ చౌర్యం, దాడి, బెదిరింపులు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు సహా మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. తన గుర్తింపును దాచుకోవడానికి మూడు వేర్వేరు పేర్లు వాడుతున్నాడు" అని శశాంక్ వెల్లడించాడు.
ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా తనపై ఒత్తిడి తెచ్చి, డబ్బు రాబట్టుకోవాలన్నదే అతని ప్రణాళిక అని తాను నమ్ముతున్నానని శశాంక్ పేర్కొన్నాడు. "సాధారణ బాధితులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే ఇబ్బంది పడుతుంటే, మా వైపు వాదన వినకుండానే ఇంత వేగంగా కేసు ఎలా నమోదు చేశారని ఆశ్చర్యపోయాను" అని అన్నాడు. ఏప్రిల్ 30న కూడా తాను ఇలాంటి పనే చేశానని వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. ఆ రోజు తాను ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నానని, కనీస నిజ నిర్ధారణ లేకుండా వార్తలు రాసి పరువు తీస్తున్నారని విమర్శించాడు.
ఈ అనుభవంతో కొన్ని కఠినమైన పాఠాలు నేర్చుకున్నానని చెబుతూ, ప్రజలకు శశాంక్ ఒక ముఖ్యమైన సూచన చేశాడు. "ఇంట్లో పనిచేసే వారిని నియమించుకునే ముందు రిజిస్టర్డ్ ఏజెన్సీల ద్వారా, పూర్తి పోలీసు వెరిఫికేషన్ తర్వాతే తీసుకోవాలి. జాలి అనేది ఇంగితజ్ఞానాన్ని భర్తీ చేయకూడదు. సత్యానికి సమయం పట్టినా, చివరికి అదే గెలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.