టాయిలెట్ అని ఇంట్లోకి వచ్చి.. మహిళ ముందు డెలివరీ ఏజెంట్ అసభ్య ప్రదర్శన
- బెంగళూరులో మహిళ ఇంట్లోకి చొరబడ్డ డెలివరీ ఏజెంట్
- అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన వైనం
- సోషల్ మీడియా పోస్ట్‌తో స్పందించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
- వ్యక్తిని తొలగించిన ఫ్లిప్‌కార్ట్.. విచారణకు సహకరిస్తామని వెల్లడి
బెంగళూరులో ఓ మహిళ పట్ల డెలివరీ ఏజెంట్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. టాయిలెట్ వాడుకోవాలనే నెపంతో ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, ఆమె ముందు అసభ్య ప్రదర్శనకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తీవ్రంగా స్పందించింది.
వివరాల్లోకి వెళితే.. మున్నేకొలాల ప్రాంతంలో నివసించే నిలోఫర్ ఫాతిమా అనే మహిళకు పార్శిల్ ఇచ్చేందుకు ఓ డెలివరీ ఏజెంట్ వచ్చాడు. వాష్‌రూమ్ వాడుకుంటానని పదేపదే అడగ్గా, తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నందున అపరిచితులను అనుమతించనని ఆమె సున్నితంగా తిరస్కరించారు. అయినా వినకుండా, అతను చెప్పులు విడిచి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడని బాధితురాలు ఆరోపించారు. అనంతరం వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి తన ఎదుట అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని సోషల్ మీడియాలో వీడియోతో సహా పోస్ట్ చేశారు.
నిలోఫర్ సోషల్ మీడియా పోస్ట్‌ను గమనించిన బెంగళూరు పోలీసులు ఆమెను సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 75, 79, 329(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడు విజయ్ మల్లికార్జున్ కామత్ (22)ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందిస్తూ, నిందితుడిని తక్షణమే విధుల్లోంచి తొలగించామని, దర్యాప్తునకు అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. డెలివరీ భాగస్వాములందరికీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందని, ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.