ఎస్.జానకి తెలుగు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణం: నారా లోకేశ్

S Janaki birth on Telugu soil is a matter of pride for all of us says Nara Lokesh
  • ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
  • దక్షిణ భారత గానకోకిలగా ఆమె ఎనలేని కీర్తి పొందారని కొనియాడిన లోకేశ్
  • 48 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచారన్న మంత్రి
  • ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ విచారం
  • జానకి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి
ప్రముఖ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

"దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధి పొందిన ఎస్. జానకి గారు 48 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించారు" అని లోకేశ్ కొనియాడారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఎస్. జానకి తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణమని లోకేశ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు.
Advertisement
S Janaki
Nara Lokesh
South Indian Singer
Andhra Pradesh Minister
Indian Cinema Music
S Janaki Death News

More Telugu News