జానకమ్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: సీఎం చంంద్రబాబు

S Janaki death is an irreparable loss to the music world says CM Chandrababu
  • దిగ్గజ గాయని ఎస్. జానకి కన్నుమూత
  • 'దక్షిణ భారత గానకోకిల'గా ఖ్యాతిపొందిన మహాగాయని
  • జానకి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం
  • ఆరు దశాబ్దాల పాటు సంగీత సేవ చేశారని కొనియాడిన సీఎం
ప్రముఖ గాయని, 'దక్షిణ భారత గానకోకిల'గా పేరుగాంచిన ఎస్. జానకి గారు కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎస్. జానకి మృతి పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. "తెలుగు గడ్డ ముద్దుబిడ్డ అయిన జానకమ్మ గారు ఇక లేరన్న వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన అసాధారణ సంగీత ప్రస్థానంతో ఎన్నో తరాలను తన కాలకతీతమైన గాత్రంతో ఓలలాడించారు. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం" అని చంద్రబాబు కొనియాడారు.

ఆమె కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జానకి గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆయన అన్నారు.
Advertisement
S Janaki
Chandrababu Naidu
Singer S Janaki Passed Away
Andhra Pradesh CM Condolences
South Indian Nightingale Janaki
Indian Music Legend Death

More Telugu News