మటన్ పెడతామని చెప్పి చికెన్ వడ్డించారు.. పెళ్లిలో రచ్చరచ్చ.. 12 మందికి గాయాలు
- బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఘటన
- చికెన్ వడ్డించడంతో వరుడి తరఫున బంధువుల అభ్యంతరం
- వాగ్వాదం కాస్తా చివరకు తీవ్ర ఘర్షణగా మారిన వైనం
- కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో విందు మెనూ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెళ్లికి వచ్చిన బంధువులకు మటన్ వడ్డిస్తామని ముందుగా చెప్పి, చివరికి చికెన్ వడ్డించడంతో వరుడి తరఫున బంధువుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదట వాగ్వాదం జరగింది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.