'జమిలి'కి రంగం సిద్ధం.. వేగంగా పావులు కదుపుతున్న జేపీసీ
- 2029 నాటికి 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అమలు సాధ్యమని జేపీసీ ఛైర్మన్ సంకేతం
- లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలపై జేపీసీ విస్తృత సంప్రదింపులు
- తరచూ ఎన్నికలతో దేశంపై రూ.7 లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతోందని వెల్లడి
- కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా ముందుకొస్తే 2029లోనే జమిలికి అవకాశం
దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) విధానాన్ని 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమలులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) ఛైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై ఏర్పాటైన ఈ కమిటీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివిధ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
గోవాలో జరిగిన జేపీసీ రెండు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంస్కరణ అమలులో ఎదురయ్యే సవాళ్లపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సహచరులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఈ విధానంపై అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని చౌదరి స్పష్టం చేశారు.
తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ఖజానాపై సుమారు రూ. 7 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక భారం పడుతోందని ఆయన వివరించారు. ఎన్నికల నియమావళి (కోడ్) కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడటంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన వంటి కీలక రంగాలు ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సంప్రదించిన వారిలో సుమారు 99 శాతం మంది పౌర సమాజ ప్రతినిధులు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు పూర్తి మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే, 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుందని చౌదరి తెలిపారు. దీనికి సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు-2024తో పాటు ఇతర అనుబంధ బిల్లులను 39 మంది సభ్యులతో కూడిన జేపీసీ కూలంకషంగా పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోని నిపుణులు, విద్యావేత్తలతో కమిటీ సంప్రదింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.