చిలీ నుంచి తన ఇంటికి 27 ఏళ్లుగా నడక ప్రయాణం.. చివరి మజిలీలో ఊహించని అడ్డంకి!
- ఇంటికి చేరే చివరి అడ్డంకి ఇంగ్లీష్ ఛానల్ దాటడం
- టన్నెల్‌లో నడిచేందుకు యూరో టన్నెల్ నిరాకరణ
- ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్‌కు ఈత కొట్టేందుకు అంగీకరించని ఫ్రెంచ్ నిబంధనలు
- గతంలో గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని, కాస్పియన్ సముద్రాన్ని దాటిన సాహసి
ఒక బ్రిటిష్ సాహస యాత్రికుడు తన ఇంటికి చేరేందుకు 27 ఏళ్లుగా సాగిస్తున్న అసాధారణ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. కానీ, గమ్యాన్ని ముద్దాడే ముందు ఊహించని నిబంధనల రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. 'ది మెట్రో' కథనం ప్రకారం.. కార్ల్ బుష్బీ (57) అనే మాజీ పారాట్రూపర్ 1998లో దక్షిణ అమెరికాలోని చిలీ నుంచి తన సొంత నగరమైన హల్‌కు నడక ప్రారంభించాడు. ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉపయోగించకూడదనేది అతను పెట్టుకున్న నియమం. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 36,000 మైళ్లు నడిచి బెల్జియం చేరుకున్నాడు. ఇక మిగిలింది ఇంగ్లీష్ ఛానల్ దాటడమే.
అయితే, ఈ చివరి అడ్డంకిని అధిగమించడం అతనికి పెద్ద సవాల్‌గా మారింది. మొదట ఇంగ్లండ్‌కు చేరుకోవడానికి యూరో టన్నెల్ సర్వీస్ టన్నెల్ ద్వారా నడిచి వెళ్లాలని భావించాడు. కానీ భద్రత, నిర్వహణ కారణాలను చూపుతూ యూరో టన్నెల్ అధికారులు జూన్‌లో అతని అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో అతనికి సముద్రంలో ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గంగా మిగిలింది.
ఈత కొట్టి ఛానల్ దాటుదామనుకుంటే ఇక్కడ ఫ్రాన్స్ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఫ్రెంచ్ అధికారులు 'బీబీసీ'కి తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో తెచ్చిన ఒక నిబంధన ప్రకారం కేవలం యూకే తీరం నుంచి ఫ్రాన్స్‌కు ఈత కొట్టడానికి మాత్రమే అనుమతి ఉంది. ఫ్రాన్స్ నుంచి యూకే వైపు ఈత కొట్టడాన్ని భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించరు. ఈ విషయంపై తాను ప్రస్తుతం ఫ్రెంచ్ కోస్ట్‌గార్డ్‌తో చర్చలు జరుపుతున్నట్లు బుష్బీ తెలిపాడు.
ఇలాంటి సాహసాలు బుష్బీకి కొత్తేమీ కాదు. 2006లో గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని నడిచి దాటిన తొలి బ్రిటన్ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, 2024లో రష్యా, ఇరాన్ మీదుగా ప్రయాణించకుండా ఉండేందుకు కాస్పియన్ సముద్రంలో 186 మైళ్లు ఈదాడు.
ప్రస్తుతం తన యాత్రలో భాగంగా వీసాలు, ఇతర పనుల కోసం మెక్సికోలో ఉన్న బుష్బీ, సెప్టెంబర్ చివరి నాటికి ఫ్రాన్స్ చేరుకోవాలని భావిస్తున్నాడు. అక్టోబర్‌లో ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదడానికి ప్రయత్నిస్తానని, దీనికి రెండు మూడు రోజులు పట్టవచ్చని, ఇప్పటికే ఒక సహాయక పడవను కూడా ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. ఈ పరిస్థితిపై తాను కోపంగా లేనని, కేవలం నిరాశ చెందానని, ఇప్పటికైనా యూరో టన్నెల్ అధికారులు తమ మనసు మార్చుకుని నడవడానికి అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు బుష్బీ పేర్కొన్నాడు.