మతం మారాలంటూ తోటి విద్యార్థి వేధింపులు.. ఉజ్బెకిస్తాన్‌లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య?
- తోటి క్లాస్‌మేటే నిందితుడని, హింసించి చంపాడని కుటుంబం ఆరోపణ
- మతం మారాలని ఒత్తిడి చేయడమే హత్యకు కారణమని అనుమానం
- నిందితుడిని భారత్‌కు రప్పించి శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్
- కేరళలో హత్య కేసు నమోదు, మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం
ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న కేరళ యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి విద్యార్థి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన వెనుక మత మార్పిడి ఒత్తిడి ఉందని, ఆమెను అత్యంత క్రూరంగా హింసించి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేరళలో కేసు నమోదైంది.
కేరళలోని ఆలప్పుజకు చెందిన సవారియా బసంత్ (21) ఉజ్బెకిస్తాన్‌లో మెడిసిన్ చదువుతోంది. అక్కడే చదువుతున్న మలప్పురం జిల్లాకు చెందిన సహపాఠి సదరుల్ అనామ్ ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇది వాగ్వివాదం నేపథ్యంలో ఆవేశంలో జరిగిన దాడి కాదని, మృతదేహంపై తల నుంచి కాలి వరకు తీవ్రమైన గాయాలు ఉన్నాయని సవారియా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. "ల్యాప్‌టాప్‌తో ఒక్క నిమిషంలో కొట్టి చంపలేదు, చాలాసేపు దారుణంగా హింసించారు" అని ఆమె బాబాయ్ జనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హత్య వెనుక మత మార్పిడి కోణం ఉన్నట్లు కుటుంబం అనుమానిస్తోంది. సవారియాను మతం మారాలంటూ నిందితుడు సదరుల్ కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని, ఈ విషయాన్ని అక్కడి ఇతర విద్యార్థులు ఉజ్బెకిస్తాన్ విచారణాధికారికి చెప్పారని జనీష్ తెలిపారు. ఆమె అందుకు నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉజ్బెకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
సవారియా మృతదేహాన్ని కేరళకు తీసుకొచ్చిన అనంతరం, కుటుంబ సభ్యులు ఆలప్పుజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం హత్య కేసు నమోదు చేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసు విచారణ మొత్తం కేరళలోనే జరపాలని, నిందితుడు సదరుల్ అనామ్‌ను ఉజ్బెకిస్తాన్ నుండి భారత్‌కు రప్పించి కఠినంగా శిక్షించాలని సవారియా కుటుంబం డిమాండ్ చేస్తోంది.