ఒకరికి మించి భార్యలుంటే ప్రభుత్వ ఉద్యోగం ఊస్ట్.. అసోంలో కొత్త నిబంధనలు
- బహుభార్యత్వం పాటిస్తే ప్రభుత్వ పథకాలకు అనర్హులు
- ఇద్దరు భార్యలున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం
- అసోం 2026-27 బడ్జెట్‌లో ఈమేరకు కీలక ప్రతిపాదనలు
- మహిళా సాధికారత కోసమే ఈ చర్యలని ప్రభుత్వం స్పష్టీకరణ
బహుభార్యత్వంపై అసోం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, బహుభార్యత్వం పాటిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.
అసోం ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బహుభార్యత్వం పాటిస్తున్న ఏ పురుషుడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు అనర్హుడవుతారని ఆయన సభకు వెల్లడించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీనికోసం 'అసోం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్-1964'కు సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఒక మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు అసోం ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా 2025 నవంబర్‌లోనే "అసోం బహుభార్యత్వ నిషేధ బిల్లు, 2025"ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే, కొన్ని షెడ్యూల్డ్ తెగలకు, ఆరో షెడ్యూల్ ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించారు.