ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ప్రధాని మోదీ అరుదైన కానుక.. 20 ఏళ్ల నాటి జ్ఞాపకం
- స్టీవ్ వాకు 20 ఏళ్ల నాటి ఫొటోను బహూకరించిన ప్రధాని మోదీ
- ఆసీస్ ప్రధానితో కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పర్యటన
- చెన్నైలో తొలిసారిగా బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహణకు నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ఓ అరుదైన కానుకను అందజేసి ఆశ్చర్యపరిచారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తామిద్దరూ తొలిసారి కలుసుకున్నప్పటి మధుర స్మృతిని గుర్తు చేస్తూ, ఆ ఫొటోను ఫ్రేమ్ చేయించి శుక్రవారం ఆయనకు బహూకరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టీవ్ వా ఆయనతో భేటీ అయ్యారు. ఆనాటి స్మృతులను నెమరువేసుకుంటూ ప్రధాని మోదీ అందించిన ఈ వ్యక్తిగత బహుమతికి స్టీవ్ వా మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు యువ క్రీడాకారులతో సంభాషించారు. క్రికెట్, కబడ్డీ, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్న అథ్లెట్లను వారు ఉత్సాహపరిచారు. ఇదే వేదికపై 'భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్'ను కూడా ఆవిష్కరించారు.
ఈ పర్యటన సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు మరో తీపి కబురు అందింది. 2026-27 బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య ఈ పోరు సాగనుంది. ఆస్ట్రేలియా గడ్డ వెలుపల బీబీఎల్ మ్యాచ్ నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.