వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' రిలీజ్ డేట్ వచ్చేసింది!

Varun Tej Korean Kanakaraju release date is out
  • వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' విడుదల తేదీ ఖరారు
  • ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి
  • మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీగా చిత్రం
  • ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో వరుణ్ తేజ్
  • భారత్, కొరియా నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ఎక్స్ ఖాతాలో కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ, "2026.. ఆగస్ట్ 7... ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ" అని పేర్కొన్నారు.

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా... భారత్, కొరియా నేపథ్యంలో సాగే కథతో విభిన్నమైన హారర్ కామెడీగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని వినూత్నమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే మార్చి నెలలో కొరియాలో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్యలపై కీలక సన్నివేశాలు, పాటలను చిత్రీకరించి చివరి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఏప్రిల్‌లో విడుదలైన 'కమ్సహమ్నిదా' పాటకు మంచి స్పందన లభించింది.

వరుణ్ తేజ్ పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. గ్లింప్స్ ప్రకారం.. కనకరాజు అనే వ్యక్తి కోసం కొరియన్ పోలీసులు ఓ ఇండియన్ ఫొటోగ్రాఫర్‌ను చిత్రహింసలకు గురిచేస్తారు. ఇంతలో, ఓ పౌర్ణమి రాత్రి తన దేహంపై ఆత్మ ఆవహించిన కనకరాజు (వరుణ్ తేజ్) పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేస్తాడు. ఈ ఘటన చూసిన ఫొటోగ్రాఫర్, "ఈ కనకరాజు మన కనకరాజు కాదు" అనడంతో కథపై ఉత్కంఠ పెరిగింది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ, సత్య జి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Advertisement
Varun Tej
Korean Kanakaraju
Merlapaka Gandhi
Thaman S
Korean Kanakaraju Release Date
Telugu Horror Comedy

More Telugu News