అఖిల్ 'లెనిన్'కు బ్లాక్ బస్టర్ టాక్.. భావోద్వేగంతో కొడుకును హత్తుకున్న నాగార్జున
- 'లెనిన్' చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్
- విజయంతో భావోద్వేగానికి గురైన అఖిల్, నాగార్జున
- ఏఎన్నార్ విగ్రహం వద్ద తండ్రీకొడుకుల ఆలింగనం
- సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
అక్కినేని అఖిల్ ఎట్టకేలకు ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' శుక్రవారం విడుదలై, తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టుకుంది. ఈ విజయంతో అక్కినేని కుటుంబంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన ఈ విజయంతో తండ్రీకొడుకులు నాగార్జున, అఖిల్ ఇరువురూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఒక వీడియోను పంచుకుంది. స్టూడియో ఆవరణలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద అఖిల్, నాగార్జున ఒకరినొకరు పరస్పరం ఆలింగనం చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం చిత్ర బృందం కేక్ కట్ చేసి, పూల వర్షం మధ్య ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుంది. 'లెనిన్ - విజయానంతరం భావోద్వేగం' అని, 'ప్రేక్షకుల ఆదరణే అతిపెద్ద విజయం' అని స్టూడియో ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు.