రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..!

Will Children Get Confused If Taught Two Languages This Is What Doctors Say
  • రెండు భాషల్లో మాట్లాడిస్తే పిల్లలు గందరగోళానికి గురవుతారనేది అపోహ
  • దీనివల్ల మాటలు రావడం ఆలస్యం కాదంటున్న నిపుణులు
  • భాషా నైపుణ్యాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టీకరణ
  • పైగా దృష్టి కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం
చాలా మంది తల్లిదండ్రుల్లో ‘‘చిన్నప్పటి నుంచే రెండు భాషలు మాట్లాడిస్తే పిల్లలు అయోమయానికి గురవుతారా?’’ అనే సందేహం ఉంటుంది. ఈ కారణంగా కొందరు ఇంట్లో మాతృభాష మాట్లాడడం మానేస్తుంటారు. పూర్తిగా ఇంగ్లిష్‌కే పరిమితమవుతారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని శిశు వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలు వినడం వల్ల పిల్లల్లో మాటలు రావడం ఆలస్యం కాదని స్పష్టం చేశారు. వారి భాషా నైపుణ్యాల అభివృద్ధిపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వివరించారు.

2025లో జర్నల్ ఆఫ్ చైల్డ్ లాంగ్వేజ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ద్విభాషా వాతావరణంలో పెరిగే పిల్లల్లో మాటలు రావడం, పదాలను పలకడం లేదా భాషా అభివృద్ధిలో ఆలస్యమైనట్లు గమనించలేదు. అలాగే 2023లో ‘ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ’లో ప్రచురితమైన సమీక్ష ప్రకారం.. రెండు భాషలు నేర్చుకునే పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ, జ్ఞాపకశక్తి వంటి మేధో సామర్థ్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

చిన్నారులు ‘‘గివ్ మీ నీళ్లు’’ లాంటి వాక్యాలు మాట్లాడితే చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కానీ దీనిని కోడ్-స్విచింగ్ అంటారని, ఇది గందరగోళం కాదు.. రెండు భాషలను ఒకేసారి నేర్చుకుంటున్నారనే సంకేతం. పిల్లల మెదడు సహజంగానే రెండు భాషల పదాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగిస్తుంది.

ద్విభాషా పిల్లలు ఒక్కో భాషలో పదాలు కొంచెం తక్కువగా తెలిసినట్లు కనిపించినా, రెండు భాషల్లో తెలిసిన పదాలను కలిపి లెక్కిస్తే వారి మొత్తం పదసంపద ఇతర పిల్లలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మాతృభాషను వదిలేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంట్లో సహజంగా మాట్లాడే భాషలోనే పిల్లలతో సంభాషించాలని సూచించారు. ఫలితంగా వారి భావోద్వేగ బంధాన్ని, భాషా వికాసాన్ని మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
Advertisement
Bilingual Children
Language Learning
Speech Development
Parenting Tips
Child Psychology
Multilingualism

More Telugu News