ఇరాన్‌పై దాడులకు ఇటలీ నో.. ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన జార్జియా మెలోని!

Italy says no to attacks on Iran as Giorgia Meloni counters Trump criticism
  • అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలో భాగస్వామి కాబోమని స్పష్టం చేసిన ఇటలీ
  • తమ దేశంలోని సైనిక స్థావరాలను అమెరికా దాడులకు ఇచ్చేది లేదన్న మెలోని
  • టర్కీ రాజధాని అంకారా నాటో సదస్సు వేదికగా వ్యాఖ్యలు
  • ఇటలీ నిర్ణయం 'పెద్ద తప్పు' అంటూ అంతకుముందు రోజు విమర్శించిన  ట్రంప్
  • ఉద్రిక్తతల ప్రారంభం నుండి తమది ఒకే స్థిరమైన విధానమని ప్రకటించిన మెలోని
టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక దాడులకు ఇటలీలోని తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతినిచ్చేది లేదని, భవిష్యత్తులోనూ తాము ఇలాంటి దాడుల్లో భాగస్వామ్యం పంచుకోబోమని ఆమె స్పష్టం చేశారు. సదస్సు సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానమిస్తూ.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి ఇటలీ ఇదే స్థిరమైన విధానాన్ని అవలంబిస్తోందని గుర్తుచేశారు.

అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడానికి ఇటలీ నిరాకరించడం ఒక 'పెద్ద తప్పు' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు రోజు విమర్శించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జార్జియా మెలోని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో, అమెరికా వ్యూహంతో తాము ఏకీభవించడం లేదని నాటో వేదికగానే ఇటలీ స్పష్టం చేసినట్లయింది.
Advertisement
Giorgia Meloni
Italy Iran strikes
Donald Trump criticism
NATO Summit Ankara
US Italy relations
West Asia tensions

More Telugu News