420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!
- న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన భారతీయ విద్యార్థిని
- ఉద్యోగం కోసం ఏకంగా 420 కంపెనీలకు దరఖాస్తు
- వచ్చినవి మూడు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే
- ఎట్టకేలకు రెండు ఉద్యోగ ఆఫర్లు సాధించిన దివ్య బన్సాల్
- ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలని యువతి స్పష్టీకరణ
విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించాలని కలలుగనే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రస్తుతం వీసా నిబంధనలు, ఆర్థిక మందగమనం పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదలతో శ్రమించి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉద్యోగం సంపాదించిన ఒక భారతీయ యువతి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్ యూనివర్సిటీ (ఎన్‌వైయూ) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దివ్య బన్సాల్.. తాను ఎదుర్కొన్న తిరస్కరణలు, వీసా కష్టాలు, వ్యక్తిగత ఆలోచనలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
దివ్య ఉద్యోగం కోసం ఏకంగా 420 కంపెనీలకు దరఖాస్తులు పంపింది. అయితే వందలాది దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, ఆమెకు కేవలం మూడు ఇంటర్వ్యూల నుండే పిలుపు వచ్చింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించి చివరికి రెండు ఉద్యోగ ఆఫర్లను సొంతం చేసుకుంది. ఎన్‌వైయూ నుండి పట్టా పుచ్చుకున్న కేవలం ఒక్క వారంలోనే ఆమె ఈ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వీసా స్పాన్సర్షిప్ అవసరాల కారణంగా విదేశీ విద్యార్థులకు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్న సమయంలో ఈ ఘనత సాధించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని దివ్య పేర్కొంది.
న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియోలో ఆమె తన మొదటి రోజు ఉద్యోగ అనుభవాన్ని పంచుకుంది. "నేను న్యూయార్క్‌కు వచ్చింది జీవితాన్ని నిర్మించుకోవడానికే గానీ, కేవలం కెరీర్ కోసం మాత్రమే కాదు" అని దివ్య స్పష్టం చేసింది. ఉద్యోగం అనేది తన ఎదుగుదలకు, బిల్లులు చెల్లించుకోవడానికి మాత్రమేనని, అది తన జీవితంలో ఒక భాగమే తప్ప అదే తన పూర్తి గుర్తింపు కాకూడదని కుండబద్దలు కొట్టింది. ఉద్యోగంతో పాటు తనకు ఇష్టమైన నృత్యం, జిమ్‌కు వెళ్లడం, ఇంట్లో వండుకునే వంటకాలు, ఆత్మీయులతో సమయం గడపడం వంటి వాటికి సమాన ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. ఉద్యోగాన్నే సర్వస్వంగా భావిస్తే కాలక్రమేణా దానిపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.

More Telugu News
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు
![]()
తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
![]()
రెండు భాషలు నేర్పితే పిల్లలు అయోమయానికి గురవుతారా? డాక్టర్లు చెబుతోందిదే..!
![]()
బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన ఏలూరు పోక్సో కోర్టు
![]()
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ
![]()
ఇరాన్‌పై దాడులకు ఇటలీ నో.. ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన జార్జియా మెలోని!
![]()
‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు
![]()
ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు!
![]()
ఆగ్రహించిన గజరాజు.. కారును ఎత్తిపడేసి మరీ దాడి
![]()
420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!
![]()
సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్!
![]()
131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా!
![]()
వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు హెచ్చరిక
![]()
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం
![]()
2,300 ఏళ్ల నాటి ప్రాచీన మద్యం లభ్యం.. చైనా సమాధిలో బయటపడిన కాంస్య సీసా!
![]()