యమహా నుంచి ప్రీమియం ఈ-స్కూటర్.. ‘ఏరాక్స్-ఈ’లో అదిరే ఫీచర్లు
- యమహా ‘ఏరాక్స్-ఈ’ భారత్‌లో విడుదల
- ధర రూ.2.82 లక్షలు.
- ఒక్కసారి ఛార్జ్‌తో 117 కి.మీ రేంజ్
- రెండు డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌లు
- అందుబాటులోకి నాలుగు రైడింగ్ మోడ్లు
- టీఎఫ్టీ డిస్ప్లేతో యాప్ కనెక్టివిటీ
భారత్‌లో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఏరాక్స్-ఈ’ని విడుదల చేసింది. దీని ధర రూ.2.82 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ప్రస్తుతం దేశీయ మార్కెట్లో యమహా విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన మోడల్‌గా ఇది నిలిచింది. కంపెనీ నుంచి భారత్‌లో విడుదలైన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఇదే.
‘ఏరాక్స్-ఈ’లో రెండు 1.5kWh డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. మొత్తం 3kWh సామర్థ్యంతో పనిచేసే ఈ బ్యాటరీలకు 9.5kW మోటార్‌ను జత చేశారు. ఈ మోటార్ గరిష్ఠంగా 12.9 హెచ్‌పీ శక్తి, 48Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుందని తెలిపింది.
ఈ స్కూటర్లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. వీటితో పాటు బూస్ట్ మోడ్‌ను కూడా ఇచ్చారు. అవసరమైన సమయంలో అదనపు శక్తిని అందించి వేగంగా ఓవర్టేక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. పెట్రోల్ ఏరాక్స్ 155 తరహాలోనే స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందించేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనం కావడంతో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
డిజైన్ పరంగా చూస్తే ‘ఏరాక్స్-ఈ’లో పెట్రోల్ వెర్షన్‌కు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్తో అదే స్పోర్టీ లుక్‌ను కొనసాగించారు. సాధారణ ఏరాక్స్లో ఉండే ఎల్సీడీ డిస్ప్లే స్థానంలో ఇందులో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. మొబైల్ యాప్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఇందులో ఉంది.
ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, పుణె, చెన్నై నగరాల్లో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పోర్టీ డిజైన్, 117 కిలోమీటర్ల రేంజ్, ప్రీమియం ఫీచర్లతో పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యమహా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది.