బుసాన్‌లో స్మార్ట్‌ షూ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌.. అధునాతన టెక్నాలజీపై ఆసక్తి

Nara Lokesh visits Smart Shoe Factory in Busan shows interest in advanced technology
  • బుసాన్‌లో షూఆల్స్‌ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌
  • స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ ఫుట్‌వేర్‌ తయారీ పరిశీలన
  • మాగ్నెటిక్‌ జనరేటర్లు, ప్రత్యేక చిప్‌లపై ఆసక్తి
  • ఏఐ ఆధారిత మెడికల్‌ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ
  • థెరపిటిక్‌, ఎర్గోనమిక్‌ షూస్‌ తయారీ ప్రత్యేకత
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ బుసాన్‌లోని ప్రముఖ షూఆల్స్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. మెడికల్‌ డివైస్‌ సర్టిఫైడ్‌ స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ ఫుట్‌వేర్‌ను తయారు చేస్తున్న ఈ సంస్థలో అధునాతన సాంకేతికతతో బూట్ల తయారీ విధానాన్ని పరిశీలించారు.

రక్త ప్రసరణను మెరుగుపరచడం, కండరాల అలసటను తగ్గించడం కోసం మాగ్నెటిక్‌ జనరేటర్లు, ప్రత్యేక చిప్‌లతో బూట్లను తయారు చేసే విధానాన్ని లోకేశ్‌ ఆసక్తిగా తిలకించారు. నడకలో అసౌకర్యాన్ని తగ్గించి పాదాలను ఆరోగ్యంగా ఉంచేందుకు మెడిచియో వైబ్రేషన్‌ చిప్‌లను బూట్లలో అమర్చే ప్రక్రియను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా షూఆల్స్‌ ప్రతినిధులు తమ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరించారు. మాగ్నెటిక్‌ థెరపీ, షాక్‌ అబ్జార్‌ప్షన్‌, కూలింగ్‌ సోల్స్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ మెటీరియల్స్‌ను కలిపి ఎంఎఫ్‌డీఎస్‌ సర్టిఫైడ్‌ మెడికల్‌ ఫుట్‌వేర్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.

సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌తో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్‌ మెడికల్‌ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. థెరపిటిక్‌ షూను చేతితో తయారు చేయడంతో పాటు స్మార్ట్‌ హెల్త్‌కేర్‌, నొప్పి నివారణకు ఉపయోగపడే ఎర్గోనమిక్‌ డిజైన్‌ను వైద్య సాంకేతికతతో కలిపి రూపొందిస్తున్నట్లు వివరించారు.

మెడికల్‌, ఎర్గోనమిక్‌ టెక్నాలజీల్లో తమకు పేటెంట్లు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పాదాల్లో గాలి ప్రసరణ సులభంగా జరిగేలా ఇన్వెన్షియో కూలర్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నామని చెప్పారు. దీంతో పాదాలు చల్లగా ఉండటంతో పాటు దుర్వాసన సమస్య కూడా తగ్గుతుందని వివరించారు.
Advertisement
Nara Lokesh
South Korea Visit
Shoealls Busan Factory
Smart Healthcare Footwear
AI Medical Shoes
Andhra Pradesh IT Minister

More Telugu News