తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కారుపై మాట మార్చిన బంధువు
- తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో రోజుకో మలుపు
- అనుమానాస్పద కారు తనను ఢీకొట్టిందన్న బంధువు.. గంటల్లోనే మాట మార్పు
- అది దాడి కాదని, కేవలం ప్రమాదం మాత్రమేనని వీడియోలో వెల్లడి
- నెల రోజులు దాటినా వీడని చిన్నారి ఆచూకీ మిస్టరీ
కాకినాడ జిల్లా తునిలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. చిన్నారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారే తనను ఢీకొట్టిందని చెప్పిన ఆమె బంధువు కోటేశ్వరరావు, కొన్ని గంటల్లోనే మాట మార్చారు. అది దాడి కాదని, కేవలం ప్రమాదం మాత్రమేనని స్పష్టం చేయడంతో ఈ కేసులో మిస్టరీ మరింత పెరిగింది.
ఏం జరిగింది?
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు దాటిన సందర్భంగా, ఆమె బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో మిస్సింగ్ పోస్టర్లు అంటిస్తున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నం సమీపంలో పోస్టర్లు అంటిస్తున్న పాప బంధువు కోటేశ్వరరావును ఆదివారం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన, చిన్నారి కనిపించకుండా పోయిన రోజు వారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన కారే తనను ఢీకొట్టిందని తొలుత ఆరోపించారు. ఈ ఘటనతో పాప అదృశ్యానికి, ఈ కారుకు సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
అయితే, ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే కోటేశ్వరరావు తన మాటను వెనక్కి తీసుకున్నారు. తాను కంగారు, కన్ఫ్యూజన్‌లో అలా చెప్పానని, తనను ఢీకొట్టిన కారు వేరని, పాప ఇంటి దగ్గర కనిపించిన కారు వేరని ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనపై జరిగింది దాడి కాదని, కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. దీంతో, ఈ ఘటనపై దాడి కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గందరగోళం ఏర్పడింది.
నెల రోజులుగా వీడని మిస్టరీ
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6వ తేదీన జ్ఞానేశ్వరి తన ఇంటి సమీపంలోని పామాయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. ఘటన జరిగి 32 రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. పాపతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పటికీ, అనారోగ్యంతో మృతి చెందింది. దాని ద్వారా ఆచూకీ కనిపెట్టాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి.
పోలీసులు పామాయిల్ తోటతో పాటు సమీప అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడపట్టారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. పాప ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. తాజాగా బంధువు కోటేశ్వరరావు మాట మార్చడంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగాయి. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.