అమెరికాలోని ఈ రాష్ట్రం ప్రాణాంతక విష సర్పాలకు నిలయం!
- అమెరికాలో విష సర్పాల రాజధానిగా ఆరిజోనా గుర్తింపు
- విషపూరిత పాముల జాతుల్లో టెక్సాస్‌ను అధిగమించిన అరిజోనా
- రాష్ట్రంలో దాదాపు 20 రకాల విష సర్ప జాతులు
- అత్యంత శక్తిమంతమైన విషం కలిగిన మొహవే రాటిల్‌స్నేక్ కూడా ఇక్కడే
- అమెరికాలో పాము కాట్లు అరుదు, మరణాలు చాలా తక్కువని నిపుణుల వెల్లడి
అమెరికాలో అత్యధిక విష సర్పాలు ఎక్కడ ఉన్నాయంటే చాలామంది టెక్సాస్ అని చెబుతారు. కానీ, తాజా వన్యప్రాణి అంచనాల ప్రకారం, ఈ విషయంలో టెక్సాస్‌ను మించి ఆరిజోనా ముందు వరుసలో నిలిచింది. అమెరికాకు 'విష సర్పాల రాజధాని'గా ఆరిజోనా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఆరిజోనా రాష్ట్రంలో సుమారు 20 రకాల విషపూరిత పాముల జాతులు, ఉపజాతులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రాటిల్‌స్నేక్ జాతికి చెందినవే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం రాటిల్‌స్నేక్ జాతులలో మూడో వంతు ఆరిజోనాలోనే ఆవాసం ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇక్కడి విభిన్నమైన ఎడారులు, రాతి పర్వతాలు, పొడి వాతావరణం ఈ సర్పాలు నివసించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తున్నాయి.
మరోవైపు, మొత్తం పాముల జాతుల సంఖ్యలో టెక్సస్ (100కు పైగా జాతులు) దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే, విషపూరిత పాముల విషయానికి వస్తే, టెక్సాస్‌లో కేవలం 15 జాతులు మాత్రమే ఉన్నాయి. దీంతో, ప్రమాదకరమైన పాముల జాతుల విషయంలో ఆరిజోనానే ముందుంది.
ఆరిజోనాలో వెస్ట్రన్ డైమండ్‌బ్యాక్, మొహవే, అరిజోనా బ్లాక్ వంటి రాటిల్‌స్నేక్స్ అధికంగా కనిపిస్తాయి. వీటిలో మొహవే రాటిల్‌స్నేక్ అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటుంది. అయితే, నిపుణుల ప్రకారం, ఈ పాములు మనుషులను చూసి వాటంతట అవే దాడి చేయవు. వాటిని అనుకోకుండా తొక్కడం లేదా ఇబ్బంది పెట్టడం వల్లనే కాటు వేస్తుంటాయి. అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండటంతో అమెరికాలో పాముకాటు మరణాలు (ఏడాదికి సగటున 5) చాలా అరుదుగా సంభవిస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.