- రెండు రోజులుగా జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న షిండే
- థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న ఆసుపత్రి వర్గాలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు షిండేను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వివిధ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా వరుస రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ వ్యవహారాలు, విపరీతమైన పనిభారం కారణంగా షిండే ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.