6 నెలల శిశువు కిడ్నాప్ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన ఏపీ పోలీసులు

Andhra Pradesh Police solve 6 month old baby kidnapping case in 24 hours
  • దర్యాప్తులో కీలకంగా మారిన 3Six-month-old boy reunited with parents 
    60 సీసీ క్యామ్స్ యాప్
  • చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు
  • బాపట్ల పోలీసులను అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు నెలల శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. తల్లి చెంత నిద్రిస్తున్న చిన్నారి అపహరణకు గురైన ఉదంతాన్ని పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. అపహరణకు గురైన శిశువును క్షేమంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లాలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఆరు నెలల పసికందు అపహరణకు గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన జిల్లా పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా, ‘360 సీసీ క్యామ్స్’ యాప్‌తో పాటు సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ ద్వారా నిందితుల కదలికలను వేగంగా గుర్తించారు.

పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి చెర నుంచి చిన్నారిని సురక్షితంగా విడిపించారు. అనంతరం శిశువును తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ క్లిష్టమైన కేసును ఛేదించి, చిన్నారిని సురక్షితంగా కాపాడిన బాపట్ల పోలీసు అధికారులను, సిబ్బందిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌కు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఏపీ పోలీసులు పునరుద్ఘాటించారు.                                
Andhra Pradesh Police
Bapatla baby kidnapping case
6 month old infant rescued
DGP Harish Kumar Gupta
360 CC Cams app
Bapatla police investigation

More Telugu News