మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ 'కింగ్' కోహ్లీ హవా!

Sports
Advertisement
  • 'ఎక్స్‌'లో కిమ్ కార్దాషియన్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ
  • 69.9 మిలియన్ల ఫాలోవర్లతో 11వ స్థానానికి చేరిన భారత స్టార్
  • జాబితాలో మస్క్, ఒబామా, ట్రంప్, రొనాల్డో, మోదీ వంటి ప్రముఖులు
Advertisement
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో రికార్డుల మోత మోగించడమే కాదు, సోషల్ మీడియాలోనూ కొత్త శిఖరాలను అందుకుంటున్నాడు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఖాతాల జాబితాలో కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. ప్రముఖ అమెరికన్ మీడియా పర్సనాలిటీ కిమ్ కార్దాషియన్‌ను దాటి ప్రపంచంలో 11వ అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా నిలిచాడు.

ప్రస్తుతం కిమ్ కార్దాషియన్‌కు 69.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. విరాట్ కోహ్లీ 69.9 మిలియన్ల ఫాలోవర్లతో ఆమెను అధిగమించాడు. ఈ అరుదైన ఘనతతో కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల సరసన చేరాడు. అయితే, కోహ్లీ కన్నా ముందున్న టాప్ 10 జాబితాలో ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఉన్నారు. 

కోహ్లీ కంటే ముందున్న టాప్ 10 వీరే..
ప్రస్తుత నివేదికల ప్రకారం.. 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ సుమారు 240 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (119.2 మిలియన్లు), డొనాల్డ్ ట్రంప్ (111.7 మిలియన్లు), ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (110.6 మిలియన్లు), భారత ప్రధాని నరేంద్ర మోదీ (106.9 మిలియన్లు) ఉన్నారు. వీరితో పాటు రిహానా, జస్టిన్ బీబర్, కేటీ పెర్రీ, టేలర్ స్విఫ్ట్, లేడీ గాగా వంటి సంగీత ప్రపంచంలోని స్టార్లు కూడా ఈ జాబితాలో కొనసాగుతున్నారు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పునరాగమనం.. లార్డ్స్‌ రికార్డుపై కన్ను
సోషల్ మీడియాలోనే కాదు మైదానంలో కూడా కింగ్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అతను ఈ నెల‌ 14 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గాయపడటంతో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ, జనవరి తర్వాత ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అలీబాగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ పర్యటనలో కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకునే అవకాశం ఉంది. లార్డ్స్ మైదానంలో జరగబోయే మ్యాచ్‌లో కనుక అతను సెంచరీ చేస్తే, 'క్రికెట్ మక్కా'గా పిలవబడే లార్డ్స్‌లో వన్డే శతకం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు కూడా ఈ మైదానంలో వన్డే సెంచరీ చేయలేదు. గతంలో ఎంఎస్ ధోని చేసిన 73 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. దీంతో కోహ్లీ పునరాగమనంపై, లార్డ్స్ రికార్డుపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Advertisement

సంబంధిత వార్తలు

Virat KohliX Twitter followersKim KardashianIndia vs England ODI seriesLords Cricket Ground recordMost followed athletes on social media

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు వద్ద తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News