పూణె హత్య కేసు: పోలీసుల ముందే సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్‌

Pune murder case Siya makes obscene gestures in front of police video goes viral
  • మీడియాకు మధ్యవేలు చూపిన సియా
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • నేడు కోర్టులో నిందితులను హాజరుపర్చనున్న పోలీసులు
  • మరికొన్ని రోజుల కస్టడీ కోరనున్న దర్యాప్తు అధికారులు
  • పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కూ అనుమతి కోరే అవకాశం
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తాజా ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను పూణెలోని నివాసం నుంచి బయటకు తీసుకొస్తుండగా మీడియా ప్రతినిధుల వైపు మధ్యవేలు (అసభ్య సైగ) చూపించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు చేతన్‌, సియా రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో మరికొన్ని రోజులు రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు ఈరోజు కోర్టును కోరనున్నారు. అలాగే లోయలోకి తోసి హత్య చేసినట్లుగా నిరూపించినట్లుగా ఆధారాలేమీ లభ్యం కాలేదు. దీంతో నిందితుల పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఈ ఏడాది నవంబర్‌లో సియా, కేతన్‌ల వివాహం జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి చేతన్‌తో కలిసి జూన్‌ 18న సియా అతడి హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. జూన్ 14న కూడా కేతన్‌ను లోయలోకి తోసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Siya Goyal
Pune murder case
Ketan Agarwal murder
Siya Goyal viral video
Pune police investigation
Chetan murder suspect

More Telugu News