వైభవ్‌ను ఆడిస్తే బంతి స్టేడియం దాటేది: రవిశాస్త్రి
- ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్‌ను ఆడించాల్సిందన్న రవిశాస్త్రి
- ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లోనైనా ఆడించాలని సూచన
- వైభవ్ లాంటి ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదని వ్యాఖ్య
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యువ సంచలనం 'వైభవ్' అరంగేట్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. సంజు శాంసన్ లేదా తిలక్ వర్మ స్థానాల్లో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటూ మాజీ క్రికెటర్లు, అభిమానుల నుండి డిమాండ్లు వస్తున్న తరుణంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్‌ను తుది జట్టులోకి దించాల్సిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. "అక్కడ గ్రౌండ్స్ చాలా చిన్నవి.. ఒకవేళ వైభవ్ క్రీజులోకి వచ్చి ఉంటే స్టేడియం అవతలికి సిక్సర్లు బాదేవాడు. ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్లు విప్పి చేతిలో పెట్టేవాడు" అంటూ తన విలక్షణ శైలిలో ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, వీలైతే అతడిని తక్షణమే తుది జట్టులోకి ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించారు. వైభవ్ లాంటి ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, అతనికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే జట్టుకు భారీ స్కోర్లు ఖాయమని స్పష్టం చేశారు.