వివాహ బంధంలోకి బోనీ కపూర్ కుమార్తె.. ఈ నెల 6న బాయ్ ఫ్రెండ్ తో అన్షులా పెళ్లి
- అన్షులా కపూర్ పెళ్లి తేదీ ఖరారు
- ధృవీకరించిన బోనీ కపూర్
- అన్షులాకు డేటింగ్ యాప్‌లో పరిచయమైన స్క్రీన్‌రైటర్ రోహన్ థక్కర్
- 2025 అక్టోబర్‌లో ముంబైలో వీరి నిశ్చితార్థం
- జూన్ 21న 'మాతా కీ చౌకీ'తో ఘనంగా ప్రారంభమైన పెళ్లి వేడుకలు
ఈ పెళ్లి వేడుకలు జూన్ 21న 'మాతా కీ చౌకీ'తో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుడి కుటుంబం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కపూర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు కుటుంబ సభ్యులంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అన్షులా, అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అన్షులా, రోహన్ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. గతేడాది జులైలో న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 2025 అక్టోబర్‌లో ముంబైలో వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగింది.
వివాహం అనంతరం సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక కాక్‌టెయిల్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు 'మోడరన్ ఇండియన్' డ్రెస్ కోడ్ పాటించాలని నిర్వాహకులు కోరారు.