తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... టీచర్లకూ మధ్యాహ్న భోజనం
- ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు మధ్యాహ్న భోజనం
- భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచడమే లక్ష్యం
- తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం
ప్రస్తుతం పీఎం-పోషణ్ (మధ్యాహ్న భోజనం) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అదే భోజనాన్ని స్వీకరించడం వల్ల ఆహార పరిశుభ్రత, పోషక విలువలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఫలితంగా ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.