అభిమానికి హార్దిక్ పాండ్యా ఊహించని సర్‌ప్రైజ్.. రూ. 1.5 లక్షల నగదుతో పాటు తన 'ఫెరారీ' కారులో ఇంటికి పంపిన స్టార్ ఆల్‌రౌండర్!
- పాండ్యాను కలిసేందుకు ఒడిశా నుండి బెంగళూరుకు సైకిల్ యాత్ర
- 10 నుండి 12 రోజుల పాటు 1,800 కిలోమీటర్ల ప్రయాణం
- క్రికెటర్‌కు జగన్నాథుడి విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన అభిమాని
- అతడికి రూ. 1.5 లక్షల నగదు బహుమతిగా ఇచ్చిన హార్దిక్
- తన సొంత ఫెరారీ కారులో అభిమానిని ఇంటికి పంపిన వైనం
బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో శిక్షణ పొందుతున్న హార్దిక్ పాండ్యాను ఈ యువకుడు ఎట్టకేలకు కలుసుకున్నాడు. ఈ సందర్భంగా దీపక్ తన వెంట తెచ్చిన ఒడిశా సంప్రదాయ శాలువాతో పాటు, పవిత్రమైన పూరీ జగన్నాథుడి విగ్రహాన్నిహార్దిక్‌కు కానుకగా సమర్పించాడు. అంత దూరం నుండి తన కోసం వచ్చిన అభిమానిని చూసి చలించిపోయిన హార్దిక్ పాండ్యా, ఆ యువకుడిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతించాడు.
ఫెరారీ కారులో తిరుగు ప్రయాణం!
అభిమాని చూపించిన ఈ అంతులేని ప్రేమకు ముగ్ధుడైన హార్దిక్.. కేవలం మాట్లాడి వదిలేయకుండా ఒక ఉదారత్వాన్ని చాటుకున్నాడు. ఆ కుర్రాడి భవిష్యత్తు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 1.5 లక్షల నగదును బహుమతిగా అందించాడు. అంతేకాకుండా, తిరిగి అంత దూరం సైకిల్‌పై వెళ్లడం కష్టమని భావించి, ఆ అభిమానిని అత్యంత గౌరవంగా తన సొంత 'ఫెరారీ' లగ్జరీ కారులో ఒడిశాలోని ఆయన ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశాడు. హార్దిక్ పాండ్యా చేసిన ఈ గొప్ప పనిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మైదానంలోనే కాకుండా నిజ జీవితంలోనూ హార్దిక్ రియల్ హీరో అని కొనియాడుతున్నారు.