వైభవ్ అరంగేట్రం ఆలస్యం.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
- ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్‌కు దక్కని అవకాశం
- 15 ఏళ్ల వయసులో ఒత్తిడిని పెద్దగా పట్టించుకోరని అభిప్రాయపడ్డ గవాస్కర్
- సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడం వైభవ్‌కు లాభమని సూచన
- వర్షం కారణంగా తొలి టీ20 రద్దు
‘‘వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు వెంటనే తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఆలస్యం అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. అయితే 15 ఏళ్ల వయసులో ఆటగాళ్లు ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించరు’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండడం, వారి నుంచి నేర్చుకోవడం వైభవ్‌కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఐర్లాండ్ సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన వైభవ్‌కు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కూడా అవకాశం లభించలేదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లతో కూడిన ఓపెనింగ్ కాంబినేషన్‌పైనే జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది. కాగా వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయింది.