ప్రకాశ్ రాజ్‌ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి: బీజేపీ నేత

Prakash Raj should be expelled from the industry says BJP leader
  • వివాదాస్పద యూట్యూబర్‌కు మద్దతివ్వడమే బీజేపీ నేత ఫైర్
  • సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు
  • యూట్యూబర్ అరెస్టును ప్రశ్నించిన నటుడు ప్రకాశ్ రాజ్
  • ప్రకాశ్ రాజ్ తీరు సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ
నటుడు ప్రకాశ్ రాజ్‌ను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఆధ్యాత్మిక గురువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ యూట్యూబర్‌కు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన రావణ్ అనే యూట్యూబర్‌ను అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా అరెస్టులు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్ తీరు సిగ్గుచేటని, ఆయన వ్యక్తిగత దూషణలను, మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.                                
Prakash Raj
Vishnuvardhan Reddy
BJP leader demand
Boycott Prakash Raj
YouTuber Ravan arrest
Andhra Pradesh politics

More Telugu News