మూడెకరాల రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధులు జమ
- 10.68 లక్షల మందికి లబ్ధి
- రూ.1,590.02 కోట్లు జమ
- డీబీటీ ద్వారా ఖాతాల్లోకి నిధులు
- ఇప్పటివరకు రూ.4,072.04 కోట్లు విడుదల
- 54.96 లక్షల మంది రైతులకు లబ్ధి
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతులకు రూ.1,590.02 కోట్ల పెట్టుబడి సాయం అందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 54.96 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.4,072.04 కోట్ల నిధులను విజయవంతంగా బదిలీ చేసినట్లు తెలిపింది. వానాకాలం సాగు ప్రారంభమైన వేళ ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఈ సాయం ఉపయోగపడుతుండటంతో రైతులు సాగు పనులను వేగవంతం చేస్తున్నారు.