హీరో అవ్వాలనుకున్నాడు... తిలక్ వర్మపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ఘాటు విమర్శలు

Sports
Advertisement
  • ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా
  • తిలక్ వర్మ స్వార్థంతో ఆడాడన్న మాజీ క్రికెటర్ శ్రీకాంత్
  • తానే గెలిపించి హీరో అవ్వాలని చూశాడని మండిపాటు
Advertisement

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించాడు.


155 పరుగుల లక్ష్య ఛేదనలో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన తిలక్.. 46 బంతుల్లో 55 పరుగులు మాత్రమే చేయడం టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. తిలక్ కేవలం సింగిల్స్, డబుల్స్‌తో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి, తానే గెలిపించి ‘హీరో’ అవ్వాలని చూశాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. జెర్సీ ఎత్తి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనే తప్ప, మ్యాచ్‌ను ముందే ముగించాలనే ప్రణాళిక అతనికి లేదన్నాడు. దూబే, అక్షర్ పటేల్ కూడా స్ట్రైక్ రేట్ పెంచడంలో విఫలమయ్యారని మండిపడ్డాడు.


భారత ఇన్నింగ్స్ మధ్యలో వరుసగా 45 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాకపోవడం అత్యంత అవమానకరమని శ్రీకాంత్ అన్నాడు. ఐర్లాండ్ వంటి సాధారణ బౌలింగ్ అటాక్ ముందు ఇలా ఆడటం వల్లే భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోవడమే కాకుండా, ఐర్లాండ్ చేతిలో మొదటిసారి టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

Advertisement

సంబంధిత వార్తలు

Tilak VarmaKris SrikkanthIndia vs Ireland T20Cricket NewsTeam India DefeatSrikkanth Tilak Varma Criticism

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News