వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మీ ఫోన్ నంబర్‌కు ఇకపై మరింత భద్రత
- ఫోన్ నంబర్ బదులు యూజర్‌నేమ్‌తో వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యే సౌలభ్యం
- యూజర్ల ప్రైవసీని కాపాడేందుకే ఈ కొత్త అప్‌డేట్ అని తెలిపిన మెటా
- గ్రూప్ చాట్‌లలో, కొత్త వారికి నంబర్ ఇవ్వాల్సిన అవసరం తప్పనుంది
- రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడి
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను వాట్సాప్‌లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం
సాధారణంగా పెద్ద గ్రూప్ చాట్‌లలో చేరినప్పుడు లేదా మొదటిసారి ఒక వ్యక్తికి గానీ, వ్యాపార సంస్థకు గానీ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ నంబర్ ఆటోమేటిక్‌గా షేర్ అవుతుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ విధానంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయాలంటే, అవతలి వ్యక్తికి మీ కచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలి. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా యూజర్‌నేమ్‌లను వెతకడానికి ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ కానీ, సెర్చ్ ఆప్షన్ కానీ ఉండదని మెటా తెలిపింది. ఇది అపరిచితుల నుంచి వచ్చే అనవసర మెసేజ్‌లను నివారిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా యూజర్లు ఉన్నందున, చాలా మందికి తమకు నచ్చిన యూజర్‌నేమ్ వెంటనే దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ఫీచర్‌ను రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ వెల్లడించింది. ఆయా దేశాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పుడు యూజర్లకు యాప్‌లోనే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తామని పేర్కొంది.
ఇదే సమయంలో క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్లకు మెటా ఒక ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. తమకు ఇప్పటికే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న యూజర్‌నేమ్‌లనే వాట్సాప్‌లో కూడా రిజర్వ్ చేసుకునేందుకు (క్లెయిమ్ చేసుకునేందుకు) అనుమతిస్తామని తెలిపింది. ఈ మార్పు వాట్సాప్‌లో వ్యక్తిగత గోప్యతను మరో స్థాయికి తీసుకెళ్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.