రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్.. రహస్య ఏజెంట్లను ప్రయోగిస్తున్న బ్రాండ్లు!
- ఇండియాలో నకిలీ వస్తువుల మార్కెట్‌పై లగ్జరీ బ్రాండ్ల ప్రత్యేక దృష్టి
- ఫేక్ సరుకును గుర్తించేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్ల నియామకం
- డమ్మీ కస్టమర్లుగా వెళ్లి సమాచారం సేకరిస్తున్న ఏజెంట్లు
- వీరి సమాచారంతో పోలీసుల దాడులు, కేసులు నమోదు
- దేశంలో నకిలీ దుస్తుల మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్లుగా అంచనా
ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. గతనెలలో వెర్సాచీ కంపెనీకి ఓ ఇన్వెస్టిగేటర్ ఇచ్చిన సమాచారంతో తూర్పు ఢిల్లీలోని ఓ బల్క్ సెల్లర్‌పై పోలీసులు దాడి చేశారు. నగరంలోని పలు దుకాణాలకు నెలనెలా లక్షల రూపాయల విలువైన నకిలీ సరుకును సరఫరా చేస్తున్న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టాక్‌ను సీజ్ చేశారు.
భారత్‌లో అసలైన లగ్జరీ మార్కెట్ విలువ 6 నుంచి 8 బిలియన్ డాలర్లు కాగా, 2028 నాటికి ఇది 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే, దీనికి భిన్నంగా నకిలీ దుస్తులు, యాక్సెసరీల మార్కెట్ విలువ సుమారు రూ. 4 లక్షల కోట్లు ఉంటుందని 2024 ఫిక్కీ నివేదిక పేర్కొంది. రోడ్ల పక్కన అమ్మకాల నుంచి ఆన్లైన్ వేదికల ద్వారా వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఈ దందా విస్తరించింది.
బ్రాండ్లు తీసుకుంటున్న ఈ చర్యలను న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. ఈ సమస్య తీవ్రతకు, సంప్రదాయ పద్ధతుల్లోని పరిమితులకు ఇది అద్దం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి రహస్య ఆపరేషన్ల ద్వారానే బలమైన ఆధారాలు సేకరించి కోర్టులో కేసులు నిలబడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించేందుకు వెర్సాచీ, మైఖేల్ కోర్స్ వంటి కంపెనీలు నిరాకరించాయి.