సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసు
- నాగరాజును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐ న్యాయవాదికి కోర్టు ఆదేశం
నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు సేకరించాలని వారు కోరారు. వాదనలు విన్న కోర్టు సీఐ తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆయన తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.
గాదె సాయికృష్ణ మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బాబురావును కూడా సిట్ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు.