బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు

BJP Next Target Telangana Ramchander Rao
  • బీజేపీ విజయానికి హైదరాబాద్ నుంచే నాంది పలుకుతామన్న రాంచందర్ రావు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని ధీమా
  • బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందన్న లక్ష్మణ్
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కంచు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి రావడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సైతం ఫుల్ జోష్ నెలకొంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో విజయఢంకా మోగించడమే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ నుంచే ఈ విజయానికి నాంది పలుకుతామని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి చూపెడతామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి వచ్చినా సరే.. బీజేపీని ఓడించడం ఎవరి తరం కాదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రేపు హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. 

మరోవైపు వరంగల్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందని అన్నారు. ఈనెల 29న నితిన్ నబీన్ వరంగల్‌లో పర్యటిస్తారని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బూత్ లెవెల్ కార్యకర్తల సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. బీజేపీని కాదని కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని అన్నారు.
Advertisement
Ramchander Rao
BJP Telangana
K Laxman
Nitin Nabin
Hyderabad Corporation Elections
Telangana Politics

More Telugu News