ఈ 5 మొక్కలు పెంచుతున్నారా?.. ఇంట్లోకి పాములు వచ్చే ప్రమాదం!

Offbeat
Advertisement
  • దట్టమైన పొదలు, నీడ ఉన్న ప్రదేశాలే పాములకు ఆశ్రయం
  • వెదురు మొక్కలు పాములకు దాచుకునే అనువైన స్థలం
  • పెరివింకిల్‌, ఐవీ తీగల కింద తేమ, ఆకుల పేరుకుపోతాయి
  • లెమన్‌గ్రాస్‌, మల్లె పొదల్లో చిన్న జీవుల సంచారం
  • గంధపు చెట్ల కింద చల్లటి వాతావరణం
  • తోటను శుభ్రంగా ఉంచితే పాములు వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం
Advertisement
ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ, కొన్ని మొక్కలు తెలియకుండానే పాములకు ఆశ్రయం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలు పాములను నేరుగా ఆకర్షించకపోయినా.. వాటి చుట్టూ ఏర్పడే దట్టమైన నీడ, తేమ, చిన్న జీవుల సంచారం కారణంగా పాములు అక్కడికి వచ్చే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

పాములు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చల్లటి, నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. అలాగే ఎలుకలు, కప్పలు, బల్లులు వంటి చిన్న జీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఆహారం కోసం కూడా వస్తుంటాయి. అందుకే ఇంటి తోటలో కొన్ని రకాల మొక్కలు ఉంటే వాటి వద్ద పాములు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వెదురు: వెదురు మొక్కలు చాలా దట్టంగా పెరుగుతాయి. వీటి మధ్య చల్లటి నీడ, దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గోడలు, కంచెల పక్కన వెదురు పెంచితే పాములు దాక్కునే అవకాశం పెరుగుతుంది.

పెరివింకిల్‌, ఐవీ తీగలు: ఇవి బిళ్లగన్నేరు జాతికి చెందిన తీగలు. ఇవి నేలపై దట్టంగా పరుచుకుంటాయి. దీంతో కింద ఏం జరుగుతుందో కనిపించదు. ఆకులు, తేమ ఎక్కువగా ఉండటంతో పాములకు ఇవి అనువైన ఆశ్రయంగా మారుతాయి.

నిమ్మ గడ్డి: ఈ మొక్కలు గుబురుగా పెరిగి అడుగు భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. చల్లటి నీడ కారణంగా పాములు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.

మల్లె మొక్కలు: మల్లె పొదలు దట్టంగా పెరుగుతాయి. వీటి వద్ద ఎలుకలు, కీటకాలు, చిన్న జీవులు ఎక్కువగా సంచరిస్తాయి. వాటి కోసం పాములు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది.

గంధపు చెట్లు: గుబురుగా పెరిగే గంధపు చెట్ల కింద తేమ, నీడ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాములు అక్కడ దాక్కునేందుకు వీలవుతుంది.

అయితే ఈ మొక్కలు ఉంటే తప్పనిసరిగా పాములు వస్తాయని కాదు. తోటను శుభ్రంగా ఉంచడం, ఎండిన ఆకులు, చెత్త పేరుకుపోకుండా చూడటం, పొదలను ఎప్పటికప్పుడు కత్తిరించడం ద్వారా పాములు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

SnakesSnake attracting plantsHome garden safetyBamboo and Jasmine plantsSnake prevention tipsGarden maintenance for snakes

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News