వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు

వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు

Crocodile in agricultural well creates panic among farmers
  • మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి
  • సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం  
  • స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం
  • సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
మహబూబాబాద్ జిల్లాలో భారీ మొసలి కలకలం సృష్టించింది. కేసముద్రం మండలం, అర్పణపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పొలం పనుల నిమిత్తం వెళ్లిన రైతులు బావిలో మొసలిని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మనుషులకు, పశువులకు ప్రాణాపాయం పొంచి ఉందని భావించిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, సహాయక చర్యలు చేపట్టడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక రైతులు, యువకులే స్వయంగా రంగంలోకి దిగారు. ఎంతో సాహసంతో వలల సహాయంతో మొసలిని చాకచక్యంగా బంధించి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం మొసలిని పరిశీలించిన అటవీ అధికారులు, దానిని సురక్షితమైన సహజ ఆవాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.                                
Advertisement
Crocodile
Mahabubabad
Kesamudram
Agricultural well
Telangana farmers
Forest department

More Telugu News