'పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!
- 'పెద్ది' సూపర్ డూపర్ హిట్
- జూన్ 4న విడుదలై రూ.345 కోట్లకు పైగా వసూళ్లు
- విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా
- ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి
- చిత్రబృందంపై ప్రశంసల వర్షం
జూన్ 4న విడుదలైన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించగా, అప్పలసూరి అనే ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ సందర్భంగా చిరంజీవి తమను అభినందించిన ఫొటోలను 'పెద్ది' చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. "మెగాస్టార్ గారు 'పెద్ది' బ్లాక్‌బస్టర్ విజయంపై చిత్ర బృందాన్ని అభినందించారు" అని పోస్ట్‌లో పేర్కొంది.

