ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్
- ఆంథ్రోపిక్ నుంచి సరికొత్త ఏఐ మోడల్ ఫేబుల్ 5 విడుదల
- మైథోస్ సిరీస్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి మోడల్
- కోడింగ్, పరిశోధన, ఇమేజ్ విశ్లేషణలో అత్యంత శక్తివంతం
- సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర
- ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే పూర్తి సామర్థ్యంతో లభ్యం
అయితే, ఈ మోడల్ వాడకంపై ఆంథ్రోపిక్ కఠినమైన భద్రతా నిబంధనలను విధించింది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సున్నితమైన అంశాలపై దీని సామర్థ్యాన్ని పరిమితం చేసింది. బ్యాంకింగ్, పవర్ గ్రిడ్లు, సాఫ్ట్‌వేర్ వంటి కీలక రంగాల్లోని లోపాలను గుర్తించే ప్రశ్నలు ఎదురైనప్పుడు, వాటిని తక్కువ శక్తివంతమైన 'ఓపస్ 4.8' మోడల్‌కు మళ్లిస్తుంది. విడుదలకు ముందు 1,000 గంటలకు పైగా రెడ్-టీమింగ్ పరీక్షలు నిర్వహించినా, పూర్తిస్థాయిలో భద్రతా వ్యవస్థను దాటలేకపోయారని కంపెనీ పేర్కొంది.
'క్లాడ్ మైథోస్ 5' అనే పూర్తి అన్‌రిస్ట్రిక్టెడ్ వెర్షన్‌ను కేవలం 200 ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే 'ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్' కింద అందిస్తున్నారు. గతంలో అమెరికా ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ఆంథ్రోపిక్ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ధరల విషయానికొస్తే, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధరను నిర్ణయించారు. ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 10 డాలర్లు, అవుట్‌పుట్ టోకెన్లకు 50 డాలార్లుగా ధర ఉంది. ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ, ఐపీఓకు సిద్ధమవుతోంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, శక్తివంతమైన మోడళ్లను క్రమంగా ప్రజలకు పరిచయం చేయాలన్న వ్యూహంలో ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.