6-6-6 వాకింగ్ టెక్నిక్: బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా!
- 6 నిమిషాల వార్మప్‌తో కండరాల సంసిద్ధత
- 60 నిమిషాలు వేగంగా నడిచే కార్డియో వ్యాయామం
- 6 నిమిషాల కూల్‌డౌన్‌తో సాధారణ స్థితికి హార్ట్ రేట్
- ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల వేళ అనుకూల సమయం
- సులభంగా బరువు తగ్గేందుకు ఉత్తమ మార్గం
ఆరోగ్యంగా ఉండటానికి నడకను మించిన వ్యాయామం లేదు. అయితే సాధారణంగా నడిచే నడకను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు సరికొత్త ఫిట్‌నెస్ విధానాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒకటే ఈ ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’. రోజువారీ నడకను పద్ధతి ప్రకారం చేస్తూ, గుండె వేగాన్ని పెంచి, ఎక్కువ క్యాలరీలు కరిగించేందుకు ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
6-6-6 వాకింగ్ అంటే ఏంటి?
* మొదట 6 నిమిషాల పాటు చాలా నెమ్మదిగా, సాధారణ వేగంతో నడవాలి. ఇది మీ కండరాలను నడకకు సిద్ధం చేస్తుంది.
* వార్మప్ పూర్తయ్యాక గంట సేపు లేదా 6,000 అడుగులు పడేలా వేగంగా నడవాలి. ఇది మీ గుండె వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తుంది.
* చివరగా మరో 6 నిమిషాల పాటు నడక వేగాన్ని పూర్తిగా తగ్గించి రిలాక్స్‌గా నడవాలి. ఇది పెరిగిన గుండె వేగాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెస్తుంది.
ఏ సమయంలో నడిస్తే మంచిది?
ఈ 6-6-6 వాకింగ్ టెక్నిక్ పూర్తి ప్రయోజనాలు దక్కాలంటే సమయం కూడా ముఖ్యమే. దీనికోసం ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల సమయాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఈ టెక్నిక్ వల్ల కలిగే లాభాలు
* గంట సేపు వేగంగా నడవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి, కీళ్లపై ఒత్తిడి పడకుండానే సులభంగా బరువు తగ్గుతారు.
* నడక వేగంలో మార్పులు ఉండటం వల్ల గుండె సామర్థ్యం మెరుగవుతుంది. రక్తప్రసరణ బాగా సాగుతుంది.
* ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడవడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గి, అలసట దూరమవుతుంది.
* నడకకు ముందు వార్మప్, తర్వాత కూల్‌డౌన్ చేయడం వల్ల కండరాలు పట్టేయడం, నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు.
జాగ్రత్తలు
అలవాటు లేని వారు మొదటి రోజే గంట సేపు వేగంగా నడిస్తే త్వరగా అలసిపోతారు. కాబట్టి మీ శరీర సహకారాన్ని బట్టి నడక వేగాన్ని నెమ్మదిగా పెంచాలి. వాకింగ్‌కు వెళ్లేటప్పుడు మంచి స్పోర్ట్స్ షూ వేసుకోవడం, సమయాన్ని చూసుకోవడానికి వీలుగా టైమర్ పెట్టుకోవడం మంచిది. నడకకు ముందు, తర్వాత తగినన్ని నీళ్లు తాగడం మర్చిపోవద్దు.