కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? మీ కాళ్లలో ఈ 3 మార్పులు వస్తే ప్రమాదమే!

Sitting Job Watch for These Leg Changes Deep Vein Thrombosis
  • ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం
  • కాళ్ల వాపులు, నరాలు ఉబ్బడం ప్రధాన సంకేతాలు
  • కాళ్లలో రక్తం గడ్డకడితే ప్రాణాంతక ముప్పు
  • గంటకు ఒకసారి చిన్న విరామం అవసరం
  • కాళ్ల వ్యాయామాలతో సమస్యను అడ్డుకోవచ్చు
ఆఫీసులలో గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారా? అయితే మీ కాళ్లలో రక్తప్రసరణ ఆగిపోయి నరాల్లో రక్తం గడ్డకట్టే ‘డీప్ వెయిన్ థ్రాంబోసిస్’ ముప్పు పొంచి ఉంది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి మీ కాళ్లలో కింద చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడే గమనించుకోండి.

పాదాల్లో వాపులు
ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల రక్తం గుండెకు చేరడం కష్టమవుతుంది. దీనివల్ల ద్రవాలు కాళ్లలోనే నిలిచిపోయి పాదాలు, చీలమండలాలు వాచిపోతాయి. రోజంతా పని ముగిసేసరికి సాక్స్ వేసుకున్న చోట గట్టిగా గుర్తులు పడటం, వేసుకున్న చెప్పులు బిగుతుగా మారడం దీనికి ప్రధాన సంకేతం.

ఉబ్బిన నరాలు
రక్తం కాళ్లలోనే నిలవడం వల్ల అక్కడి రక్తనాళాల్లోని చిన్న వాల్వ్‌లు దెబ్బతింటాయి. దీనివల్ల చర్మంపై నీలి రంగులో సాలీడు గూడు లాంటి నరాలు (స్పైడర్‌ వెయిన్స్‌) లేదా తాడులా లావుగా ఉబ్బిన నరాలు (వెరికోస్‌ వెయిన్స్‌) బయటకు కనిపిస్తాయి. ఇవి కాళ్లలో విపరీతమైన నొప్పులను కలిగిస్తాయి.

కాళ్లు మొద్దుబారడం
కాళ్ల వైపు రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు అక్కడి నరాలకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల కాళ్లు హఠాత్తుగా మొద్దుబారడం, సూదులతో పొడిచినట్లు లేదా చీమలు పాకినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కాళ్లపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.

చిన్న మార్పులతో చెక్
డెస్క్ ఉద్యోగాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి సీటు నుంచి లేచి రెండు నిమిషాలు అటు ఇటు నడవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లపై కాలు వేసుకోకుండా పాదాలను నేలకు ఆన్చాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కాళ్ల కింద దిండు పెట్టుకుని గుండె కంటే కాస్త ఎత్తులో ఉంచితే నిలిచిపోయిన రక్తం మళ్లీ ఫ్రీగా సరఫరా అవుతుంది.
Go Back to Shorts
Deep Vein Thrombosis
DVT
leg swelling
varicose veins
spider veins
desk job health
blood circulation
sitting job risks
leg numbness
office work health

More Telugu News