ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్

Vijay Receives Virat Kohli Signed MRF Bat as Gift
  • సీఎం విజయ్‌ని కలిసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు
  • బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిచ్చిన విజయ్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‍‌గా మారిన ఫొటో
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌తో ఫోటోకు పోజులిచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. ముఖ్యమంత్రి విజయ్‌ని టైర్ల తయారీ దిగ్గజ సంస్థ ఎంఆర్‌ఎఫ్ ప్రతినిధులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ స్వయంగా సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను ఆయనకు బహుమతిగా అందించారు. ఆ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్న విజయ్, చిరునవ్వుతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో విజయ్ సూట్ ధరించి, భుజంపై కండువా ధరించి ఉన్నారు. రాష్ట్రంలో కంపెనీ ప్రతిపాదించిన రూ.5,300 కోట్ల గ్రీన్ ఫీల్డ్ టైర్ల తయారీ ప్లాంట్‌పై కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ కె.ఎం.మమ్మన్ ఉన్నారు.
Advertisement
Vijay
Tamil Nadu
MRF
Virat Kohli
MRF bat
Cricket
K.M. Mammen
Greenfield tire plant
Tamil Nadu CM

More Telugu News