మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త
- వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్న భట్టివిక్రమార్క
- సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత
- వ్యవసాయ రంగంలో లక్ష్యాలను మించి రుణాలు ఇస్తున్నాయని బ్యాంకులకు కితాబు
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ప్రజాభవన్‌లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవనం వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అన్నారు. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళలు, దళిత, గిరిజన, యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని అన్నారు.