కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి
- ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
- ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు రీజినల్ మేనేజర్ వెల్లడి
- మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న రీజినల్ మేనేజర్
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రవాణా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 5,772 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రీజియన్‌లోని హన్మకొండ, వరంగల్ 1, వరంగల్ 2, పరకాల, నర్సంపేట, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్ డిపోల నుంచి కాళేశ్వరానికి 59 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మరిన్ని ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల నుంచి నడిచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనంగా వసూలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి ప్రయాణికులకు యథావిధిగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని అన్నారు.