నల్గొండలో తీవ్ర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
- అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ యువతి మృతి
- మృతురాలు చెరువుగట్టు గ్రామానికి చెందిన గడ్సు నవ్య (24)గా గుర్తింపు
- ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఘటన
- మృతదేహం ఇండియా తరలింపునకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడ్సు నవ్య (24) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో, స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
నవ్య రెండున్నరేళ్ల క్రితం అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, చికాగో సమీపంలో వారి వాహనాన్ని వెనుక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కూతురి మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు గడ్సు శ్రీనివాస్ రెడ్డి, శోభ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, నవ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, తానా, ఆటా ప్రతినిధులతో మాట్లాడి సహకారం అందించాలని కోరారు.